Project water resources

From Open Educational Resources
Revision as of 00:15, 6 March 2016 by Nagaraju (talk | contribs) (Created page with "'''నీటి వనరులు''' =లక్ష్యములు= #విద్యార్థులు తమ ఆవాస ప్రాంతంలోని వివి...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

నీటి వనరులు

లక్ష్యములు

  1. విద్యార్థులు తమ ఆవాస ప్రాంతంలోని వివిధ నీటి వనరులను తెలుసుకుంటారు.
  2. వివిధ నీటి అవసరాలు అవి లభించే నీటి వనరులను గుర్తిస్తారు.
  3. నీటి వృధాను అరికట్టే పద్దతులను తెలుసుకుంటారు.
  4. వివిధ నీటి యాజమాన్య పద్దతులను గురించి తెలుసుకుంటారు.
  5. వివిధ పద్దతుల ద్వారా కావాల్సిన సమాచార సేకరించడాన్ని దానిని విశ్లేషించడాన్ని తెలుసుకుంటారు.
  6. ICT ద్వారా సమాచార సేకరణ, విశ్లేషణ, ప్రదర్శన మొదలైన వాటిని తెలుసుకుంటారు.


ఉండాల్సిన నైపుణ్యాలు

  1. సమాచార సేకరణ నైపుణ్యం
  2. స్ప్రెడ్ షీట్ లలో సమాచారాన్ని నింపడం.
  3. ఆడియో రికార్డ్ చేయడం, కెమెరా / మొబైల్ ద్వారా ఫోటోలు తీయడం.

కావాల్సిన వనరులు

హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్

  1. కెమెరా / మొబైల్ ఫోన్, ఆడియో రికార్డర్ (విద్యార్థుల సంఖ్యను అనుసరించి)
  2. కంప్యూటర్లు
  3. కాగితం, పెన్ను, పెన్సిల్,
  4. స్ప్రెడ్ షీట్, టెక్ట్స్ సాఫ్ట్ వేర్, ఇమేజ్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్.

Project output

కృత్యములు

  1. ఇంటర్వ్యూ చేయడం
  2. సమాచార సేకరణ
  3. సమాచార నమోదు, విశ్లేషణ
  4. గ్రామ పటమును చిత్రించుట
  5. ప్రదర్శన
    1. ఫోటోలు తీయడం, సేకరించడం, ప్రదర్శన
    2. ఆడియో మరియు వీడియో రూపంలో ప్రదర్శన

Digital portfolio

మొదటి స్థాయి

  1. గ్రామంలోని వివిధ నీటి వనరులు, వాటి స్థితిగతులు, గ్రామ జనాభా మొదలైన వాటి సమాచార సేకరణ
  2. సేకరించిన సమాచారాన్ని విశ్లేషణ చేసి, టెక్ట్స్ రూపంలో ప్రదర్శన
  3. గ్రామ పటం, నీటి వనరులను, మంచినీటి సరఫరా పట ప్రదర్శన
  4. "గ్రామం అప్పుడు, ఇప్పుడు" కరపత్ర తయారీ

మూడవ స్థాయి

  1. గ్రామ నీటివనరుల వీడియో
  2. గ్రామంలోని పెద్దవారి ఇంటర్వూ యొక్క వీడియో


Implementation notes

ఉపాధ్యాయునికి కొన్ని సూచనలు

నీరు మనకు ప్రాణాధారం. చెట్ల నరికివేత, జనాభా, పారిశ్రామీకరణ, నీటి వృధా మొదలైన కారణాలచే మనకున్న నీటి వనరులు తగ్గిపోతున్నాయి. గ్రామంలోని జనాభా, వివిధ నీటి వనరులు సంఖ్య (నదులు, కాలువలు, చెరువులు, బావులు, బోరు బావులు, చేతిపంపులు, కొళాయిలు) మొదలైన వాటిని సేకరింపచేయాలి. గ్రామంలో కల బావులు వాటి లోతులు, బోరు బావులు వాటి లోతులు వాటిని తవ్వించిన సంవత్సరం మొదలైన వాటిని స్ప్రెడ్ షీట్ లలో నమోదు చేయించి, గ్రాఫ్ లు, పట్టికల ద్వారా భూగర్భ జలాల తగ్గుదలను విశ్లేషింపచేయాలి. గ్రామంలోని పెద్దవారిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా గతకాలంనకు, ఇప్పటికి గల నీటి లభ్యతలోని తేడాలను, వాటికి గల కారణాలను తెలియచెప్పించాలి. గ్రామ నీటివనరుల పటంను రూపొందించాలి (ఇంటర్నెట్ సహాయంతో మ్యాప్స్ ను తయారుచేయించాలి). ఈ సమాచారంతో నీటి పొదుపు చేయుటకు, భూ గర్భ జలాల పెంపునకు గల ఆవశ్యకతను తెలియచెప్తూ కరపత్రాన్ని రూపొందించాలి. గ్రామంలోని నీటి వనరులు, నీటి సరఫరా వ్యవస్థ, నీటి వృధా అరికట్టుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచెప్తూ ఒక డాక్యుమెంటరీని రూపొందించాలి.

స్థాయి 1 - సమాచార సేకరణ, నమోదు చేయడం, ప్రదర్శించడం
స్థాయి 2 - కరపత్ర తయారీ
స్థాయి 3 - ఒక డాక్యుమెంటరీని తయారుచేయడం

కాలనిర్ణయ పట్టిక

  1. స్థాయి 1-After completion of data processing module
  2. స్థాయి 2-After completion of graphics module
  3. స్థాయి 3-End of year

Duration and modality of the project

స్థాయి 1

  1. సమాచార సేకరణ కొన్ని ప్రశ్నలు వేయడం ద్వారా- ఒక వారం
  2. సమాచార నమోదు - ఒక వారం
  3. సమాచార విశ్లేషణ - ఒక వారం

స్థాయి 2

  1. ఇంటర్వ్యూ, కెమెరా ద్వారా సమాచార సేకరణ - ఒక వారం
  2. ఫోటోలని ఎడిటింగ్ ద్వారా కరపత్ర తయారీ - ఒక వారం

స్థాయి 3

  1. వీడియోల ద్వారా సమాచార సేకరణ - ఒక వారం
  2. వీడియో ఎడిటింగ్ ద్వారా డాక్యుమెంటరీ తయారీ - రెండు వారాలు

Subject anchor

ఈ ప్రాజెక్ట్ ను ఏ ఉపాధ్యాయుడైనా చేయించవచ్చు